నల్ల బ్యాడ్జీలతో Aeo ల నిరసన.

Rathnakar Darshanala
నల్ల బ్యాడ్జీలతో Aeo ల నిరసన.
కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఏ.ఈ.వో.లు.

పెద్దపల్లి అక్టోబర్ 29: నేటి వార్త ప్రతినిధి ఆడిచర్ల రమేష్

పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ లో గ్రామ రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మండలంలోని ఏ. ఈ. ఓ. లు నల్ల బ్యాడ్జీలు ధరించి నేల పై కూర్చొని నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన డి. సి. ఎస్. సర్వే మిగితా 11 రాష్ట్రాల లోగా మన రాష్ట్రం లో కూడా ప్రైవేటు ఏజెన్సీ కి ఇచ్చి 1000 ఎకరాల కు ఒక వ్యక్తి నీ మించకుండా చేయాల్సి ఉంది,అందుకు  ప్రతి ఫారం కు నిధులు కూడా వచ్చాయి. ఈ నిధులను మిగితా 11 రాష్ట్రాల ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చి చేపిస్తున్నామని అన్నారు.
ఇందుకు భిన్నంగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఈ పనినీ ఇదివరకే వివిధ పథకాలు  శాఖ పరమైన విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులను ఏ.ఈ.ఓ.లతో అధికారుల  ప్రజా ప్రతినిధుల దృష్టి కి తీసుకెళ్తున్న తరుణం లో ఈ డి. సి. ఎస్. సర్వే మాకు సంబంధం లేని రైతు భీమా పథకాన్ని తూచిగా పెడుతూ రాష్ట్రం లో అమాయకులైన 165 మంది ని సస్పెండ్ చేయడం జరిగింది.
ఈ నకిలీ సస్పెన్షన్సను రద్దు చేయాలని గత బుధవారం (23 అక్టోబర్) రోజున సాయంత్రం లోగా సస్పెన్షన్ రద్దు చేస్తామని చెప్పడం జరిగినది. అయినా ఇప్పటివరకు జరగలేదు. ఈ కార్యక్రమంలో ఏ. ఈ. ఓ. లు పాల్గొన్నారు.
Comments