అనాధ వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు.

Rathnakar Darshanala
అనాధ వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు.
నేటి వార్త జూలై 26 గిద్దలూరు :
 
గిద్దలూరు పట్టణం పి ఆర్ కాలనీలో ఉండే సంజీవిని ఫ్యూచర్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వృద్ధా, అనాధాశ్రమంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ నెంట్ట్ శివ నాయక్, పద్మావతి ల కూతురు వేదాన్షి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

ముందుగా చిన్నారి తో కేక్ కట్ చేయించి ఆశ్రమంలో ఉన్న దాదాపు 30 మంది అనాధ మరియు వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. 
అనంతరం వారికి భోజన సౌకర్యం కల్పించారు. అనాధ ఆశ్రమంలో ఉంటున్న చిన్నారుల పుస్తకాలు మరియు బట్టలు పెట్టుకునేందుకు వీలు కల్పిస్తూ పదివేల రూపాయల విలువగల 10 ట్రంకు పెట్టెలను డాక్టర్ శివ నాయక్ దంపతులు చిన్నారులకు పంపిణీ చేశారు. 

అనంతరం డాక్టర్ శివ నాయక్ మాట్లాడుతూ మా చిన్నారి వేదన్షి పుట్టినరోజు వేడుకలు సంజీవిని ఫ్యూచర్ హెల్ప్ చారిటబుల్ ఫౌండేషన్ లో జరుపుకోవడం చాలా సంతోషమని, 

అలాగే ఇక్కడ పిల్లలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి శుభకార్యాల్లో అనవసర ఖర్చులు తగ్గించుకొని,ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ లలో సహాయం చేస్తే వారికి ఎంతో కొంత మేలు చేసిన వారము అవుతామని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ రాజశేఖర్ తో పాటు డాక్టర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments