అసలు కౌలు రైతు ఎవరు....?
By
Rathnakar Darshanala
అసలు కౌలు రైతు ఎవరు....?
ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త :
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ను కల్పిస్తున్న నేపథ్యంలో కౌలు రైతు కు భరోసా కల్పించాలని పలు డిమాండ్లు వస్తున్నాయి. అయితే కొంతమంది రైతులు తమకు వందల ఎకరాలు ఉన్న వారి వద్ద నుంచి కౌలుకు తీసుకొని సాగు చేసి పంటలు పండిస్తారు.
కౌలుకు తీసుకొనే ముందు ఒక ఒప్పందం చేసుకొని ఒప్పందపత్రాలు నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో లేదా పంచాయతీ సర్పంచ్ సమక్షంలో మాట్లాడుకుని రాత పూర్వక మూగ ఒప్పందం పత్రాలు రాసుకొని దగ్గర ఉంచుకొంటారు.
ఒప్పందం గడువు పూర్తి అయితే ఆ పత్రాలు చించివేయడం లేదా తిరిగి భూ యజమానికి ఇచ్చివేయడం జరుగుతుంది.
ఇటువంటి వారికి కూడా రైతు భరోసా కల్పించాలని ప్రభుత్వం సంకల్పం చేసింది. గత ప్రభుత్వం లు కూడా సంకల్పం చేసినప్పటికి రైతుల మధ్య చిచ్చు పెట్టిన వారం అవుతాము అని భావించడం జరిగింది.
ఈ కౌలు రైతుల విషయంలో అయితే కెసిఆర్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పట్టేదార్ను మాత్రమే తాము పరిగణలోకి తీసుకొని రైతు బందు ఇస్తామని చెప్పారు.
కౌలు రైతులు, రైతులు కల్సి ప్రైవేట్ ఒప్పందం చేసుకొన్న మేరకు రైతు బందును కౌలు రైతుకు ఇస్తారా..? లేదా అన్నది వారి ఒప్పందం మేరకు ఉంటుంది.
దాంట్లో మేము జ్యోక్యం చేసుకోము, వెలుపెట్టాదాల్చుకోలేదాన్నారు.
ఇది ఇలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో వై ఎస్ రాజశేకరరెడ్డి హయాంలో కౌలు రైతు గుర్తింపు అనేది ప్రభుత్వ అధికారులతో చర్చించి సరియైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అది రెండు ఎట్లా అంటే కౌలు రైతులను రెండు రకాలుగా విభజించడం చేశారు. అందులో 1) వ్యవసాయం పని మీదనే ఆధారపడి భూమి ఒక గుంట కూడా లేకున్నా భూమి ఉన్న పట్టేధార్ (భూ యజమాని )వద్ద కౌలుకు తీసుకొని కౌలునామా పత్రం రాయిoచుకొన్న రైతులనే కౌలు రైతులుగా గుర్తించి వారికి లోన్లు గానీ, ప్రభుత్వ పరంగా సహాయం అందించారు.
అది అసలైన పట్టేదార్కు ఎటువంటి నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నారు ఇలా తీసుకోవడంతో రైతులకు,
ఇటు కౌలు రైతులకు ఆర్ధిక
మూగ చేయూతనందించారు. మరికొంత మంది రైతులుంటారు చూడు సన్నకారు, చిన్నకారు, 5 ఎకరాలు పై బడిన వారు ఉంటారు.
చిన్న కారు రైతులు అంటే 2 ఎకరాల వరకు భూమి పట్టా కల్గి ఉన్న రైతులు, లేదా ప్రభుత్వం భూమి కొనుగోలు కింద లాభపడ్డ రైతులు, 2ఎకరాలు కంటే ఎక్కువ ఉండి 5 ఎకరాలు లోపుగల రైతులు వీరిని చిన్న కారు కంటే కొంచెం పెద్ద రైతన్న మాట సన్నకారు రైతు,
ఇక 5 ఎకరాలు ఆ పై ఉన్న రైతులు సాధారణ స్థాయి రైతులు అన్న మాట. పైన ఎర్కొన్న రైతులకు పట్టాభూమి ఉంటుంది.
ఇలాంటి వారు ఎక్కువ పంటలు పండించాలని
కోరికతో ఎక్కువ భూమి ఉన్న పట్టాదారు రైతులనుంచి కౌలుకు భూమిని తీసుకొని సాగు చేస్తుంటారు.
ఇలాంటి రైతులు పట్టా భూమి కొంత ఉండి, ఎక్కువ దిగుబడి కోసం భూమిని కౌలుకు తీసుకోవడం జరుగుతుంది కనుక వీరిని కౌలు రైతులు గా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి గుర్తించలేదు.
ఎంతోకొంత పట్టా భూమిని కల్గి ఉన్నారు కనుక వీరు రైతుల కోవకిందికి వస్తారని స్పష్టత ఇచ్చారు. వీరికి బ్యాంక్ వారు సొంత పట్టా మీదనే స్వల్ప కాలిక రుణాలు పొందవచ్చని తెలిపారు.
దీన్ని బట్టి కౌలు రైతులు అంటే అసలే భూమిని కల్గి లేకున్నప్పటికి భూమి ఉన్న యజమాని వద్ద భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తాడు కాబట్టి అతనిని కౌలు రైతుగా గుర్తించి తగు ఆర్థిక సహాయం అందించారు.
అది ఎట్లా అని కొంతమంది ప్రశ్నలు వేయవచ్చు. పట్టేధార్ అనుమతి ఇచ్చిన, ఇవ్వక పోయిన కౌలునామ పత్రం ఆధారంగా తహసీలధార్ ధ్రువపరుస్తే చాలు ఆ రైతుకు స్వల్ప కాలిక అప్పు గానీ ఇతర ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు.
తదితర సహాయం అందేది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కౌలు రైతులను ఆదుకుంటామని చెపుతున్నప్పటికి కౌలు రైతులను గుర్తించడం లో ఎటువంటి నిర్ణయం తీసుకొంటాడో తెలియాల్సిన అవసరం ఉంది.
బి ఆర్ ఎస్ ప్రభుత్వం లాగా రైతులు, కౌలు రైతులు మీరు మీరు చూసుకోండి అంటారా లేక ఆయన సొంత పార్టీ నిర్ణయం ఏదైనా జిమ్మికు ఉందా లేక అనుభవం గల్గిన స్వర్గీయ వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి అనుసరించి చూపిన మార్గం అనుసరనీయం అంటాడా లేక ఇంకేదైనా ఆలోచన చేస్తారేమో ముందుముందు తెలుస్తుంది.
ఏది ఏమైనాప్పటికి, ప్రస్తుత పరిస్థితితో కౌలు రైతులకు,భూమి పట్టేధార్లు గా ఉన్న రైతుల మధ్య గొడవలు జరుగకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వం పై ఉన్నది.
Comments