శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్.

Rathnakar Darshanala
శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్....
నేటి వార్త పెద్దపల్లి టౌన్ జూలై 20 ఇనుగంటి సంతోష్ రావు

శనివారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బంది హాజరు కార్యక్రమంలో  చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ డాక్టర్ దాసరి మమతా రెడ్డి  హాజరు కావడం జరిగింది.

 ఈ సందర్భంగా చైర్ పర్సన్  శానిటేషన్ సిబ్బందితో మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైన్ కోర్ట్స్, గ్లౌజులు, కాళ్లకు బూట్లు తప్పనిసరి ధరించాలని అన్నారు.

 అనంతరం జెండా,మజీద్ మరియు మినీ ట్యాంక్ బండ్ వద్ద సానిటేషన్ పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ షాహిదా సాబీర్ ఖాన్  సానిటరీ ఇన్స్పెక్టర్ పులిపాక రాజు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments