అధిక ధరలకు మద్యం అమ్మకాలు.
By
Rathnakar Darshanala
అధిక ధరలకు మద్యం అమ్మకాలు.
చెన్నూరు రూరల్ నేటివార్త ఏప్రిల్ 22 :
చెన్నూర్ పట్టణంలోని మద్యం దుకాణాల్లో హోల్ సేల్ మద్యం బాటిళ్లను ప్రింట్ రేటు కు అమ్మాల్సి ఉండగా,
బాటిల్ మీద్ 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఎక్కువ తీసుకొని అమ్ముతున్నారని పట్టణ కాంగ్రెస్ నాయకుడు సుశీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు.
అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారన్న విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి చెప్పిన కానీ లిక్కర్ వ్యాపారుల దగ్గర మార్పు రాలేదన్నాడు.
బహుశా ఎక్సైజ్ అధికారులకు వ్యాపారుల వద్ద నుండి మామ్ముళ్ళు ముడుతున్నాయన్న అనుమానం ఉందన్నాడు.
చెన్నూరు లో ఇలాంటి లిక్కర్ వ్యాపారం మూడు క్వార్టర్లు, ఆరు బీర్లు వలే కొనసాగుతుందని అక్రమ లిక్కర్ వ్యాపారం చేస్తే జైలు కు వెళ్ళడం మాత్రం ఖాయం అంటున్నారు ప్రజలు.
Comments