వనపర్తి నల్లచెరువులో వ్యక్తి గల్లంతు.

Rathnakar Darshanala
వనపర్తి నల్లచెరువులో  వ్యక్తి  గల్లంతు.
*--సంఘటన స్థలని  పరిశీలన ఎమ్మెల్యే*

*--గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారుల ఆదేశించిన ఎమ్మెల్యే*

*నేటివార్త ఏప్రిల్ 17  (వనపర్తి జిల్లా ప్రతినిధి విభూది కుమార్)*

మంగళవారం మధ్యాహ్నం వనపర్తి పట్టణం నల్లచెరువులో స్నానం చేసేందుకు వెళ్లి వనపర్తి రాయిగడ్డకు చెందిన ఉందే కోటి కృష్ణయ్య గల్లంతయ్యారు.

ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.బుధవారం ఉదయం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి  సంఘటన స్థలం నల్లచెరువుకు చేరుకొని గాలింపు చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలింపు చర్యలను ముమ్మరం చేసి గల్లంతయిన వ్యక్తి ఆచూకీ తెలుసుకోవాలని అధికారులు ఆదేశించారు.

ఇలాంటి సంఘటనలు వేసవికాలంలోనే ఎక్కువగా జరుగుతుంటాయని తల్లిదండ్రులు  పిల్లలను ఒంటరిగా ఈతకు గానీ చేపల వేటకు గాని పంపకూడదని ఆయన సూచించారు.
Comments