అర్హులైన ప్రతి ఓటరు ఓటింగ్ లో పాల్గొనాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్. రాహుల్ రాజ్. పిఎస్.

Rathnakar Darshanala
అర్హులైన ప్రతి ఓటరు ఓటింగ్లో పాల్గొనాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్.

అర్హులైన ప్రతి ఓటరు పోలింగ్ లో పాల్గొని వందశాతం పోలింగ్ నమోదుకు కృషి చేయాలనీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు.

 బుధవారం స్వీప్ కార్యక్రమాలలో భాగంగా బోథ్ మండల కేంద్రంలో I vote for sure (నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను) అనే అంశంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో బోథ్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, ఐటిడిఏ పిఓ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి కలెక్టర్ ప్రారంభించరు.

ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం నుండి అంబెడ్కర్ కూడలి వరకు, ప్రధాన కూడలా నుండి తిరిగి తహసీల్దార్ కార్యాలయం కు చేరుకుంది.

ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ నెల 31 వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఫారం-6 ను బూత్ స్థాయి అధికారికి గాని, తహసీల్దార్ కార్యాలయంలో గాని సమర్పించాలని తెలిపారు. జిల్లాలో పోలింగ్ వంద శాతం నమోదయ్యేలా ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలని అన్నారు.

 ఐటిడిఏ పిఓ మాట్లాడుతూ, బోథ్ నియోజక వర్గంలో ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. 

అనంతరం బోథ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్, పిఓ లు ప్రారంభించి, కార్యాలయంలోని గదులను పరిశీలించారు. అనంతరం బోథ్ నియోజక వర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్విహించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అన్నారు.

ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ప్రచారం కొరకు గోడల పై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు వంటి వాటికీ, సభలు, సమావేశాలు, వాహన ర్యాలీలకు రిటర్నింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. దేవాలయాలు, చార్చి లు , మసీదులు, ఇతర ప్రార్థన ప్రదేశాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమని, నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

 రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను సమర్పించాలని అన్నారు.  అలాగే దినపత్రికలు, వివిధ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా లో ప్రకటనలకై మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ ద్వారా అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో మరుగుదొడ్లు, త్రాగునీరు, ర్యాంపులు, ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. 

బోథ్ జూనియర్ కళాశాల భవనంలో ఏర్పాటుచేసిన ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీ, సమావేశాలలో నోడల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments