ఛార్జ్‌షీట్‌కు ‘రేటు’ ఫిక్స్: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ, కానిస్టేబుల్!.

Rathnakar Darshanala
ఛార్జ్‌షీట్‌కు ‘రేటు’ ఫిక్స్: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ, కానిస్టేబుల్!.
 నేటి వార్త, సైబరాబాద్:

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నెంబర్ 696/2026 కేసుకు సంబంధించి దర్యాప్తు ముగించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బందేల బలరాజ్, కానిస్టేబుల్ ,రైటర్ బొట్ట రాఘవేంద్ర కుమార్ శనివారం రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 

కేసులో అధికారిక సహాయం కోసం ఫిర్యాదుదారుడి నుంచి ఎస్ఐ బలరాజ్ డిమాండ్ చేసిన రూ. 75,000 లంచం సొమ్మును తీసుకుంటుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి పట్టుకుని, 

ఆయన కార్యాలయ టేబుల్ డ్రాయర్ నుంచి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, అంతకుముందే ఎస్ఐ బలరాజ్ రూ. 20,000 నగదును, 

కానిస్టేబుల్ రాఘవేంద్ర కుమార్ యూపీఐ ద్వారా రూ. 10,000 లంచంగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. 

అక్రమ లబ్ధి కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరిద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments