కామారెడ్డి రూరల్ సిఐ రామన్ బదిలీ బాధాకరం.

Rathnakar Darshanala
కామారెడ్డి రూరల్ సిఐ రామన్ బదిలీ బాధాకరం.
నేటి వార్త :
 కామారెడ్డి జిల్లా కామారెడ్డి రూరల్ సిఐ రామన్ బదిలీ బాధాకరమని కామారెడ్డి జిల్లా ప్రజలు వాపోతున్నారు.

సదాశివనగర్  కామారెడ్డి రూరల్ సిఐ గా విధులు నిర్వహిస్తున్న రామన్ బదిలీ అయ్యారు ఇక్కడ దాదాపు రెండేళ్ల పాటు పనిచేసిన ఆయన బదిలీపై వెళ్లారు ఆయనను హైదరాబాద్లోని ఐజి  కార్యాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది.

కామారెడ్డి రూరల్ సిఐగా పనిచేయడానికి అనేకమంది తమ ప్రయత్నాలు కొనసాగించినట్టుగా ప్రచారం సాగింది,

 గత కొద్ది కాలంగా రూరల్ సీఐ బదిలీ అవుతారని ప్రచారం నేపథ్యంలో ఇక్కడ వచ్చే అధికారులు పేర్లు చెక్కర్లు   కొట్టాయి సదాశివ నగర్ సిఐ గా రామన్ పని చేసినప్పుడు అందరికీ ఆదర్శవంతముగా పనిచేశాడు,

 ఫ్రెండ్లీ పోలీస్ గా బాధ్యతలు చేపట్టి అనంతరం కామారెడ్డి రూరల్ సిఐగా బాధ్యతలు చేపట్టి రెండున్నర ఏండ్లు కామారెడ్డి ప్రశాంత వాతావరణ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన సీఐ రామన్ బదిలీ కావడం పట్ల కామారెడ్డి జిల్లా ప్రజలు తమ బాధ వ్యక్తం చేస్తున్నారు.

 కామారెడ్డి రూరల్ గా పని చేసిన సిఐ రామన్ బదిలీ కావడం నమ్మబుద్ధి కావడం లేదని సిఐ రామన్ ఎక్కడున్న పదో న్యాయం   పొంది డిఎస్పీగా మా ముందుకు రావాలని ఆశిస్తున్నామని కామారెడ్డి జిల్లా ప్రజలు పేర్కొన్నారు
Comments