ADB :రక్తదాన శిబిరానికి భారీ స్పందన - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
By
Rathnakar Darshanala
ADB :రక్తదాన శిబిరానికి భారీ స్పందన - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
*అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరం నిర్వహణ.
*జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 817 మంది ప్రజలు, యువత, పోలీసులు.
*స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచిన జిల్లా ఎస్పీ.
*ఒకప్పటి పోలీసు ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ప్రశాంత జిల్లా కు కారణం.
*అత్యవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడేది రక్తం, రక్తదానం మహోన్నతమైనది.
*ప్రజారక్షణకై పండుగలను సైతం త్యాగం చేస్తూ విధి నిర్వహణలో ఉండే వ్యవస్థ పోలీసు వ్యవస్థ.
*రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ.
నేటి వార్త ఆదిలాబాద్ :
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు.
బుధవారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేయబడిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని, రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన గావించి, భారీ ఎత్తున ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల అధికారులు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు భారీ ఎత్తున పాల్గొని అమరవీరుల జ్ఞాపకార్థం వారు చేసిన సేవలను స్మరిస్తూ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు.
ఈ రక్తదాన శిబిరాలలో దాదాపు జిల్లా వ్యాప్తంగా 817 యూనిట్ల రక్తాన్ని పోలీసులు, ప్రజలు, ఔత్సాహికుల రక్తాన్ని రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేసినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ స్వయంగా రక్తదానాన్ని చేసి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలవడం జరిగింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ స్వయంగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అమరవీరుల సమస్మరణ వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని,
ఒకప్పటి పోలీసులు చేసిన త్యాగాలను జిల్లా ప్రజలకు సవివరంగా వివరించి పోలీసులు చేసే విధులపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఒకప్పటి అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత వాతావరణ కి కారణమని గుర్తు చేశారు. ప్రజలు పోలీసు అమరవీరులను స్మరిస్తూ ఉండాలని తెలిపారు.
ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.
వృత్తిరీత్యా పోలీసులు ఉన్నతమైన వ్యక్తిత్వ భావాలు కలవారని, వారిని ప్రజలు గౌరవించాలని, రాత్రనకా, పగలనకా, పండుగలు, కుటుంబ సభ్యులను విడిచి, ప్రజా ధన ప్రాణ మాన రక్షణలో 24 గంటలు పోలీసు యంత్రాంగం విధి నిర్వహణలో ఉంటారని తెలిపారు.
జిల్లా అభివృద్ధి పథంలో వెళ్లడానికి సంఘవిద్రోహశక్తులు ఆటంకాలుగా మారుతారని, మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి సంఘవిద్రవశక్తులతో పోరాడుతూ జిల్లా పోలీసు వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు.
రక్తదానం శిబిరం పెద్ద ఎత్తున ప్రజలు పోలీసు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ రక్తదాన శిబిరంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డాక్టర్లు, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, కమతం ఇంద్ర వర్ధన్, పట్టణ సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిమ్స్ సిబ్బంది, ఎన్జీవో నాయకులు, ప్రజలు, యువజన సంఘాలు, ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments