Jagityala :బీసీలకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి.
By
Rathnakar Darshanala
బీసీలకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి.
నేటివార్త జగిత్యాల బ్యూరో ఫిబ్రవరి 05 :
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,
దాని ద్వారా బిసిలందరికీ రుణాలను అందించాలని దేశంలో కూడా జనగణనలో కులగణన కూడా చేపట్టాలి.అంతరించిపోతున్న కులవృత్తులవారిని ఆదుకోవాలి.
బిసిలకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించాలని బిసిలను అన్ని రంగాల్లో ఆర్థికంగా ఆదుకోవాలని బిసిలను ఆర్థికంగా సామాజికంగా అణగా తొక్కుతున్నారు.
కేంద్రంలో రాష్ట్రంలో బిసి లకు తగిన ప్రాధాన్యత కల్పించాలని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి చట్టబద్ధత కల్పించాలని చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.
మన రిజర్వేషన్లు సాధించుకోవడానికి బిసి కులసంఘాలు ఏకమై పోరాటం చేయడానికి సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా చేసిన బడ్జెట్ లో కేవలం రూ. 2500 కోట్లు మాత్రమే కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర బిసిల అభివృద్ధి కోసం కేంద్రం తక్కువగా బడ్జెట్ కేటాయించడం వివక్షరమని బిసి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ కేటాయింపులు బిసిల సంక్షేమానికి సరిపోవని, సామాజిక న్యాయానికి పెద్ద ద్రోహమని నేతలు ఆరోపించారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతిరాజ్ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే ఆమరణ నిరాహారదీక్షలు చేపడుతామని ఎన్నికల హామీలను నెరవేర్చకుండా బిసిల ఆత్మగౌరవంతో ఈ ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్,
బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, అనుమల్ల సంజయ్ సామ్రాట్,
బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, మరియు మేరు సంఘం నాయకులు వెన్న మహేష్,
రాపర్తి గణేష్, రాగిల్ల నారాయణ, గట్ల రమేష్, R. రమేష్, మాడిశెట్టి మల్లేశం, గట్ల రాధా కిషన్, జి. ధర్మయ్య, మాడిశెట్టి కిరణ్, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బండపెల్లి నర్సయ్య, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments