రైస్ మిల్లర్లతో ఈ.పీ.ఎఫ్. అధికారుల సమావేశం.

Rathnakar Darshanala
రైస్ మిల్లర్లతో ఈ.పీ.ఎఫ్. అధికారుల సమావేశం.
కార్మికులకు ప్రయోజనాల పై అవగాహన.

పెద్దపల్లి అక్టోబర్ 28 నేటి వార్త ప్రతినిధి ఆడిచర్ల రమేష్ 

కార్మికులకు ప్రభుత్వం ద్వారా లభించే పలు ప్రయోజనాలను జిల్లా నోడల్ ఎన్ ఫోర్స్
మెంట్ అధికారులు ఏనుగు మోహన్ రెడ్డి,డీకే రావు,అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

సుల్తానాబాద్ పట్టణంలోని సోమవారం స్థానిక రైస్ మిల్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు ఎర్రవెల్లి పురుషోత్తం రావు, అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రైస్ మిల్లర్లు, లేబర్ లకు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా లేబర్ లకు కలిగే పలు ప్రయోజనాలను వివరించారు. ప్రతి లేబర్, వర్కర్లకు తమ ఈ. 

పి.ఎఫ్.ఈ.ఎస్.ఐ.కలిగి ఉండాలని తద్వారా భవిష్యత్తులో చేకూరే ప్రయోజనాలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నిధి ఆప్కే నికత్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం. తిరుపతిరెడ్డి, మిల్లర్లు జైపాల్ రెడ్డి, 

మినుపాల ప్రకాష్ రావు, కొమురవెల్లి రాములు, కొమురవెల్లి శ్రీకాంత్, పల్ల వాసు,రైస్ మిల్లర్లు లేబర్లు తో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments