Hyderabad :సైబర్ నేరాలపై అవగాహనే రక్షణ.
By
Rathnakar Darshanala
సైబర్ నేరాలపై అవగాహనే రక్షణ.
*-ముగిసిన ఎస్‌సీఎస్‌సీ ‘దిల్‌సే’ శిక్షణ కార్యక్రమం*
నేటి వార్త,సైబరాబాద్:
సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటమే మొదటి మెట్టని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అన్నారు.
సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ‘దిల్‌సే’ రెండ్రోజుల ట్రైన్-ది-ట్రైనర్ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.
ఈ ముగింపు వేడుకలో సీపీ మాట్లాడుతూ నిత్యం మారుతున్న ఆర్థిక నేరాలు, సోషల్ మీడియా వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శిక్షణ పొందిన వాలంటీర్లు సమాజంలో సైబర్ భద్రతా రాయబారులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ జనరల్ రమేష్ కాజా మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, ఎస్‌సీఎస్‌సీ ఒక విశిష్టమైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా అని కొనియాడారు.
ఎస్‌సీఎస్‌సీ జాయింట్ సెక్రటరీ రఘు కన్నన్ నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణలో డీసీపీ సాయి మనోహర్, సీఈఓ నవేద్ ఖాన్, భానుమూర్తి, కృష్ణవేణి తదితరులు ఆర్థిక మోసాలు, ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్స్, సైబర్ చట్టాలు,
1930 హెల్ప్‌లైన్ తదితర కీలక అంశాలపై వాలంటీర్లకు ప్రాక్టికల్ సెషన్స్ నిర్వహించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను సత్కరించి, పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
Comments