పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టాలి -పురుషోత్తం నారగౌని.

Rathnakar Darshanala
 
పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టాలి -పురుషోత్తం నారగౌని.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జనగామ జిల్లా కమిటీ ఎన్నిక.
 
తెలంగాణ మీడియా పాలసీ ప్రకటించాలి. 

తెలంగాణ ప్రెస్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

జర్నలిస్టుల సంక్షేమ పథకాలు ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఇవ్వాలి.

నేటి వార్త జనగామ, జనవరి 29 : 

రాష్టరావిర్భావం కోసం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన చిన్న పత్రికలు ( స్థానిక పత్రికల ) సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించి గత ఎన్నో సంవత్సరాలుగా,

 పెండింగ్ లో ఉన్న ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టి రుణభారంతో బ్రతుకులీడుస్తున్న పాత్రికేయులను ఆదుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని  అన్నారు.

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జనగామ జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ అధ్యకతన బుధవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగినది. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. 

ప్రజాస్వామ్య విలువలు కాపాడడం లోనూ అలాగే ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తున్న చిన్న పత్రికల  పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు.

 గత ప్రభుత్వం ఎన్నో ప్రమాణాలు చేసినప్పటికీ ఒక్కటి అమలుకు నోచు కోలేదని వందలాది చిన్న పత్రికలు ఎమ్పనెల్మెంట్ లేక ప్రభత్వ ప్రకటనలు రాకపోవడంతో,

 ఆయా పత్రికల యాజమాన్యాలు దుర్భర పరిస్థితి ఎరుకొంటున్నాయని వీటి గురించి అన్నీ విషయాలు స్పష్టంగా తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వీటిని ఆదుకొని తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టాలని అన్నారు. 

 ప్రభుత్వం వెంటనే పట్టించుకుని, ఆర్థిక సహాయ ప్యాకేజీలను ప్రకటించాలని ఆయన కోరారు. 

అలాగే తెలంగాణ మీడియా పాలిసినీ ప్రకటిండం, తెలంగాణ ప్రెస్ అండ్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా, 

తెలంగాణ భూమి పుత్రులైన పాత్రికేయులకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు తమ జీవితాన్ని పత్రికా రంగానికి అంకితం చేసి, ప్రజల గొంతుకగా నిలుస్తున్నారన్నారు . 

అలాగే జర్నలిస్టు స్కీమ్ లలో యూనియన్ల పాత్రను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా టి. ఎస్. జె. యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న యూనియన్లు జర్నలిస్టు ల సంక్షేమం కోసం కాకుండా 

తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమయ్యాని అలా కాకుండా తాము ఒక ప్రత్యామ్నాయ జర్నలిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చూట్టామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రావుల నరేష్ పాల్గొన్నారు.

జనగామ జిల్లా కమిటీ : గౌరవ సలహాదారుడిగా చీల కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షుడిగా ఎం. శివకుమార్, జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలంచి నరేందర్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మగాని శ్రీకాంత్ గౌడ్, 

కోశాధికారిగా కొన్నే ఉపేందర్, ఉపాధ్యక్షులుగా గంగిశెట్టి మహేష్ కుమార్, గుడికందుల కృష్ణ, చిటుకుల ఆంజనేయులు, వల్లాల మధు, సహాయ కార్యదర్శులుగా జీ.ప్రవీణ్ కుమార్, పీ.రాజు, గోవర్ధన్, సాగర్, కార్యవర్గ సభ్యులుగా చెల్లోజు నవీన్ చారి, 

పోచంపల్లి రజిత శ్రీనివాస్, గన్ను కార్తిక్, చిటుకుల అశోక్, ఓంకార్, సల్ల రవీందర్, ఎండి అఫ్రోస్, రమేష్ యాదవ్, మహిపాల్, తుంగ కౌశిక్ తదితరులు ఎన్నికయ్యారు.
Comments