గ్రామ పంచాయతీ ఎన్నికల వేల ప్రజలకు SI వంశీకృష్ణ సందేశం.
By
Rathnakar Darshanala
గ్రామ పంచాయతీ ఎన్నికల వేల ప్రజలకు SI వంశీకృష్ణ సందేశం.
నేటివార్త డిసెంబర్ 2 గంగాధర :
గంగాధర SI వంశీకృష్ణ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి మండల ప్రజలకు పలు సూచనలు చెయ్యడం జరిగింది.స్వేచ్ఛా, నిష్పక్షపాత, శాంతియుత గ్రామపంచాయతి ఎన్నికలు జరుగడానికి ప్రతి పౌరుడి సహకారం అవసరం. ఎన్నికల కాలంలో చట్టం–శాంతి కాపాడటం మన అందరి బాధ్యత అని Si తెలిపారు.
*పౌరులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు*
1) ఎన్నికల సమయంలో శాంతి, సామరస్యాన్ని కాపాడండి. రాజకీయ కారణాల వల్ల వాగ్వాదాలు, గొడవలు, గుంపుల మధ్య ఘర్షణలు చేయవద్దు.
2) డబ్బు, మద్యం, బహుమతులు తీసుకోవద్దు – ఇవి నేరం. ఇలాంటి చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది.
3) తప్పుడు వార్తలను లేదా పుకార్లను సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు లేదా సమావేశాల ద్వారా పంచవద్దు.
4) ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) ఖచ్చితంగా పాటించండి.
5) అనుమానాస్పదంగా కనిపించే అక్రమ కార్యకలాపాలు, బెదిరింపులు, అక్రమ రవాణా, బహుమతుల పంపిణీ వంటివి గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయండి.
Comments