చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు.మంచిర్యాల డీసీపీ భాస్కర్.

Rathnakar Darshanala
చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు.మంచిర్యాల డీసీపీ భాస్కర్.
లక్షెట్టిపేట, నేటి వార్త డిసెంబర్ 01 :

దండేపల్లిలో బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. డీసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. 

సోమవారం శనిగారపు బాపు(52), ఉపారపు సతీష్ (40)ను అరెస్ట్ చేశారు. ఈ నెల 24న ఓ 7ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారు. అనంతరం హత్య చేసి గ్రామంలోని బావిలో పడేశారు. 

ఈ కేసు దర్యాప్తుకై 
మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్   ఆధ్వర్యం లో నాలుగు బృందాలు సీఐ లక్షెట్టిపేట రమణమూర్తి  , ఎస్ ఐ దండేపల్లి తాహేశీనుద్దీన్, లక్షెట్టిపేట ఎస్సై సురేష్,  జన్నారం ఎస్సై అనూష లు టీమ్ లుగా విడిపోయి దర్యాప్తు ను శరవేగం చేశారు.  

నవంబర్ 27 వ తేదీన ఉదయం బాధితురాలి శవం కొక్కెర మల్లయ్య బావిలో తేలిందని తెలియగా నిందితులు శనిగారపు బాపు, ఉపారపు సతీష్ ఫోన్ మాట్లాడుకొని మూడు రోజులు దొరకకుండా తలదాచుకున్నారు.

 కానీ పోలీసులకు దొరికే అవకాశం ఉందని గ్రహించిన నిందితులు కలిసి దూరంగా ఎక్కడికైనా పారిపోదామని  సోమవారం ద్వారకా గ్రామ శివారులో కలుసుకొని వారి  యొక్క మోటార్ సైకిళ్ళ  పై మాదాపూర్ నుండి మ్యాదరిపేట వైపు వెళ్తుండగా దర్యాప్తులో భాగంగా పక్కా ప్లాన్ తో మాదాపూర్ లోని  శ్రీ సిద్ది వినాయక హనుమాన్ టెంపుల్ మాదాపూర్ రోడ్డు వద్ద పోలీస్ లు  పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.

 వారి వద్ద బాధితురాలి 2 గాజులు, పట్టగొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చిన్నారి అత్యాచారం కేసు ను తక్కువ సమయంలో చేధించిన లక్షెట్టిపేట సీఐ బృందాన్ని డీసీపీ భాస్కర్ అభినందించారు.
Comments