పేదల అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు.
By
Rathnakar Darshanala
పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వ కట్టుబడి ఉంది.మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
* లబ్ధిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
టెక్కలిలోనే 208 మంది పేదలకు రూ.2.10 కోట్ల సహాయం.
* జనవరి 2026 నుంచి రూ.25 లక్షల వైద్య బీమా అమలు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
నేటి వార్త కోటబొమ్మాళి, డిసెంబర్ 1 :
పేద ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కూటమి ప్రభుత్వం ఆ దిశగా స్పష్టమైన సంకల్పంతో ముందుకు సాగుతోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
పేద ప్రజల వైద్య చికిత్సకు ఆర్థిక అండగా ఈ నిధి కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. ఒక్కరోజులోనే 35 మంది లబ్ధిదారులకు రూ. 26,86,327 విలువైన చెక్కులను అందజేయడం జరిగినట్లు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యసహాయం అందిస్తున్న ప్రమాణం గణనీయంగా పెరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు.
టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 208 మంది పేద రోగులకు సిఎంఆర్‌ఎఫ్ ద్వారా దాదాపు రూ. 2.10 కోట్లు మంజూరు చేయడం ప్రభుత్వం పేదల పట్ల చూపుతున్న మనసుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో ప్రభుత్వ స్పందన వేగంగా, పారదర్శకంగా ఉండడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోనుంచి బయటపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పేద మరియు మధ్యతరగతి ప్రజల వైద్య అవసరాల్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో పేదలకు వైద్య భద్రతను మరింత బలపర్చే చారిత్రక నిర్ణయం తీసుకున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.
వచ్చే జనవరి 2026 నుంచి పేద కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు వైద్య బీమా సౌకర్యం అమలులోకి రానుందని వెల్లడించారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న పరిమితి కంటే ఇది భారీ పెంపు కావడంతో వేలాది కుటుంబాలకు పెద్ద స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఎవ్వరూ ఇబ్బంది పడకూడదన్న ధృఢ సంకల్పంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో పేదల వైద్య సహాయాన్ని కూడా దోచుకున్న పరిస్థితులు ప్రజలు చూశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. అక్రమాలు, అవినీతి, నిధుల దుర్వినియోగం కారణంగా అనేక నిజమైన లబ్ధిదారులు నష్టపోయారన్నారు.
అయితే, కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తూ, పదేపదే వైద్య సహాయాన్ని అందిస్తూ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు ఆయన తెలిపారు.
కూటమి పాలన అంటే పేదల సంక్షేమమే ధ్యేయం అని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Comments