Jagityala :లైన్‌మెన్ల మందు పార్టీ…ముగ్గురు సస్పెండ్.

Rathnakar Darshanala
Jagityala :లైన్‌మెన్ల మందు పార్టీ…
*ముగ్గురికి సస్పెన్షన్*

 నేటివార్త జగిత్యాల బ్యూరో, నవంబర్ 16:

టౌన్–1 సెక్షన్ కార్యాలయంలో స్టాఫ్ రూమ్‌లో మందు పార్టీ చేసిన ముగ్గురు అసిస్టెంట్ లైన్‌మెన్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. 

ఏ. ప్రభాకర్, జి. బాలకృష్ణ, వి. రాజశేఖర్‌లను ప్రాథమిక విచారణ అనంతరం డీఈ గంగారాం సస్పెండ్ చేశారు.
ఈ ఘటనపై ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 

సబ్‌స్టేషన్‌లు, కార్యాలయాల్లో అనైతిక చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. 

విధులు నిర్వహించడంలో ఉలంఘనకు పాల్పడితే సస్పెన్షన్ డిస్మిసల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో హెచ్ఆర్డి విభాగం అడ్వైజరీ మెమోను జారీ చేశారు.
Comments