ప్రతి ఆదివారం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామస్మరణం.

Rathnakar Darshanala
ప్రతి ఆదివారం  భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామస్మరణం.
నేటి వార్త నవంబర్ 02 గొల్లపల్లి: 

ప్రతి ఆదివారం కుల మతాలకు ,రాజకీయాలకు అతీతంగా నిర్విరామంగా కొనసాగుతున్న అంబేద్కర్ స్మరణం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయులను కీర్తించాలని మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం కోరారు.

 జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రం లో మాజీ వైస్ ఎంపీపీ  ఆవుల సత్యం  ఆధ్వర్యంలో  ప్రతి ఆదివారం  అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం ఘనంగా  నిర్వహిస్తున్నారు.

 ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా రేవెల్ల రవీందర్ బంసెఫ్ జిల్లా అధ్యక్షుడు పాల్గొని  మండల కేంద్రంలోని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించి అంబేద్కర్ కీర్తిని ప్రతి భారత పౌరుడు స్మరించుకోవాలని కోరారు.  

కార్యక్రమంలో భారత రాజ్యాంగ పీఠికను సబ్యులు అందరి చేత చదివి వినిపించారు.ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికను ప్రతి ఒక్కరు  చదివి దాన్ని అర్థం చేసుకోని   పాటించాలని సూచించారు.
రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలతో పాటు పిల్లలందరూ పాల్గొనే విధంగా పెద్దలు సహకరించాలని వారు కోరారు. 

అనంతరం ఆవుల సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు,ఆశయాలను ఆదర్శాల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడంతో పాటు స్మరించుకోవాలి ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం మండల కేంద్రంలో నిర్వహిస్తామని తెలిపారు .  

కార్యక్రమం  ప్రతి ఆదివారం   మండల కేంద్రంలో నిర్వహిస్తున్నందున  అంబేద్కర్ వాదులు ఆవుల సత్యం కి అభినందనలు తెలిపారు.హాజరైన బహుజనులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమలో కొండ్రా తిరుపతి అధ్యాపకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంపెల్లి హన్మాండ్లు, కచ్చు కొమురయ్య, న్యాయవాది చిర్ర దిలీప్,మాజీ సర్పంచ్ బలభక్తుల కిషన్,మారం రాజశేఖర్,   

శాలివాహన కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిరికొండ తిరుపతి,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చెవులమద్ధి సంతోష్, రజక సంఘం అధ్యక్షులు కలకోట సత్యం, పర్లపెల్లి నరేందర్, చెవులమద్ధి గంగాధర్, జంగిలి ఎల్లయ్య, జైరిపోతుల నరేష్, ఎరవేణి కన్ను,భోజనపు శ్రీనివాస్, 

రాజలింగు, గంగయ్య, దావుల రాకేష్ కుమార్, సరసాని అనిల్ రెడ్డి,గంగాధర మధుసూదన్, తూర్పాటి అంజి, జంగిలి శ్రీనివాస్,  కొండయ్య,రాజలింగు,అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు.
Comments