విరాట్–రోహిత్ దుమ్మరేపిన రాంచీ వన్డే.. - భారత్ భారీ స్కోరు.
By
Rathnakar Darshanala
విరాట్–రోహిత్ దుమ్మరేపిన రాంచీ వన్డే..
- భారత్ భారీ స్కోరు.
నేటి వార్త రాంచీ, నవంబర్ 30 :
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ సత్తా చాటుతూ భారత్‌కు భారీ స్కోరు అందించారు.
50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్ 349 పరుగులు చేసింది. రన్ మెషీన్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులతో చెలరేగి సచిన్ ‘ఆల్‌టైమ్’ రికార్డును బద్దలుకొట్టాడు. ఏకంగా 7 సిక్సర్లు, 11 ఫోర్లు బాదిన కోహ్లీ ఇన్నింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఘన స్పందన లభించింది.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 57 పరుగులు చేస్తూ మంచి ఆరంభం ఇచ్చాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 60 పరుగులతో కీలక సమయంలో నిలబడ్డాడు.
యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 18, శ్రేయస్ అయ్యర్ 8, వాషింగ్టన్ సుందర్ 13, జడేజా 32 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్, మధ్యమద్యలో వచ్చిన భాగస్వామ్యాలతో భారత్ దుమ్మురేపే స్కోరు అందుకుంది.
Comments