బాంబు పేలుడు ఘటన విచారకరం.

Rathnakar Darshanala
బాంబు పేలుడు ఘటన విచారకరం.
ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన అప్పిశెట్టి.

నేటి వార్త గిద్దలూరు నవంబర్ 12.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు దుర్ఘటన విచారకరమని, 

ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని గిద్దలూరు పట్టణ బిజెపి అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారని ఆయన అన్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరామర్శించడం అభినందనీయమని అన్నారు. 

ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, వారు ఎంతటి వారైనా శిక్షపడేలా చూడాలని ఆయన డిమాండ్ చేసారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments