కోట్లనర్సింహులపల్లి లో వృద్ధ మహిళపై పుస్తెళతాడు దొంగతనం.
By
Rathnakar Darshanala
కోట్లనర్సింహులపల్లి లో వృద్ధ మహిళపై పుస్తెళతాడు దొంగతనం.
నేటివార్త నవంబర్3 గంగాధర రిపోర్టర్ (జంగిలి మహేందర్)
గంగాధర మండలం, కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన వేముజాల సత్తమ్మ భర్త భూమయ్య, కులం: మున్నూరుకాపు,
తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటలకి గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు వచ్చి “అమ్మా అమ్మా, తలుపు తెరువు” అని పిలిచాడు. భయంతో తలుపు తీయకపోవడంతో ఆ వ్యక్తి బలంగా తలుపులు కొట్టడంతో తలుపు గడి దెబ్బతిని తెరుచుకుంది.
తరువాత ఆ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి ప్రవేశించి, బాధితురాలి మెడలో ఉన్న సుమారు 2½ తులాల బరువైన పుస్తెల తాడు మరియు పుస్తెలను కత్తిరించి దొంగలించుకుపోయాడు అనంతరం తలుపు బయట నుండి గడియ పెట్టి పారిపోయాడు.
ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, గంగాధర ఎస్.ఐ. వంశీ కృష్ణ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Comments