ADB :వికలాంగుల సంక్షేమనికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి జూపల్లి కృష్ణరావు.
By
Rathnakar Darshanala
ADB :వికలాంగుల సంక్షేమనికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి జూపల్లి కృష్ణరావు.
నేటి వార్త ఆదిలాబాద్ :పట్టణం కైలాష్‌నగర్‌లో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన దివ్యాంగుల సంఘ భవనాన్ని రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు చేపట్టి దివ్యాంగులకు విద్య, ఉపాధి, స్వయం సమర్థతలో అవకాశాలు పెంపొందిస్తామని భరోసా ఇచ్చారు.
కొత్తగా నిర్మించిన సంఘ భవనం దివ్యాంగుల సేవా కార్యక్రమాలు, సమావేశాలు, శిక్షణలకు వినియోగపడుతుందన్నారు.
ఈ సందర్భంగా స్థానిక దివ్యాంగుల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ భవనం నిర్మాణం చేపట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ జి. నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐ టి డి ఏ పి ఓ యువరాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments