ADB :అర్ధరాత్రి ఆకస్మికంగా రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీటర్ల ను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
By
Rathnakar Darshanala
ADB :అర్ధరాత్రి ఆకస్మికంగా రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీటర్ల ను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
* రౌడీ లపై ఉక్కు పాదం.
*ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని సూచన.*
*చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక.*
*పట్టణంలోని మహాలక్ష్మి వాడ, ఎస్సీ కాలనీ, శాంతినగర్ లలో ఉన్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను ఆకస్మిక తనిఖీ*
*అర్ధరాత్రి 11 నుండి 1 వరకు స్పెషల్ ఆపరేషన్*
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్*
నేటి వార్త ఆదిలాబాద్ :
జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణం శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా రక్షించడం పోలీసుల బాధ్యతగా అర్ధరాత్రి ఆకస్మికంగా రౌడీ షీటర్ల తనిఖీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ చేపట్టడం జరిగింది.
మంగళవారం అర్ధరాత్రి 11 గంటల నుండి 1 గంటల వరకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కోడళ్లను మరియు పూరవీధులను సందర్శిస్తూ, ప్రజలకు సమస్యలు తెచ్చే రౌడీషీటర్ల, సస్పెక్ట్ షీటర్ లను తనిఖీ చేయడం జరిగింది.
రౌడీలను, సస్పెక్ట్ లను పరిశీలించి వారి నేరచరిత్ర ప్రస్తుత, జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సన్మార్గంలో ప్రయాణించాలని, తిరిగి నేరాలు చేయాలనే ఆలోచన వస్తే జైలు తప్పదని హెచ్చరించారు.
పట్టణంలోని మహాలక్ష్మి వడ, శాంతినగర్, ఎస్సీ కాలనీ నందు గల రౌడీషీటర్ ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించి, వారిని తనిఖీ చేయడం జరిగింది.
నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో సంచరిస్తున్న వారిని తనిఖీ చేసి మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారి వాహనాలను జప్తు చేయడం జరిగింది. అర్థరాత్రి రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేయాలన్నారు.
రాత్రి సమయాలలో పోలీసు సిబ్బంది పటిష్టంగా గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments