ADB :పత్తి రైతులను విస్మరిస్తే ఊరుకునేది లేదు. మాజీ మంత్రి జోగు రామన్న.
By
Rathnakar Darshanala
పత్తి రైతులను విస్మరిస్తే ఊరుకునేది లేదు. మాజీ మంత్రి జోగు రామన్న.
కాసుల కోసం రైతులను విస్మరిస్తే ఎంపీ ఎమ్మెల్యేల పదవులు ఊడబీకుతాం.మాజీ మంత్రి జోగు రామన్న.
ఏడు క్వింటల్ నిబంధన ఎత్తివేయాలి.
దిగుమతల సుంకం 11% నీ జీరో చేయడన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
తేమశాతాన్ని తొలగించి ప్రతి రైతు నుండి పత్తిని కొనుగోలు చేయాలి.
రైతుల పక్షాన మాట్లాడాల్సిన ఎంపీ ఎమ్మెల్యేలు.. కార్పొరేట్ వ్యవస్థకు మద్దతు పలుకుతున్నారు.
నేటి వార్త ఆదిలాబాద్ :
తేమ నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలనీ ఎన్నోమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకునే నాథుడు లేదాని,
తాజాగా ఎకరానికి ఏడూ క్వింటాళ్ళు మాత్రమే cci కొనుగోలు చేస్తుందన్న నిబంధనలతో పాటు దిగుమతి సుంకాలను 11% ఉన్న జీరో పర్సెంట్ ఎత్తివేయడం తో ఈ విధానంతో రైతులను కేంద్రం నట్టేట ముంచుతోందని మాజీమంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు.
రైతుల పట్ల కేంద్రం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీ.ఆర్.ఎస్ శ్రేణులు చేపట్టిన ఎంపీ నగేష్ ఇల్లు ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
ఎంపీ ఇంటి ముందు మాజీమంత్రి జోగురామన్నతో పాటు నేతలు బైటాయించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ఎంపీ ఇంటి ముట్టడి విషయం తెలుసుకున్న పోలీసులు మూడు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన. బారికేడ్లను తోసుకుంటూ మాజీమంత్రి తో పాటు నేతలు ఎంపీ ఇంటి వైపు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
రైతుల పట్ల కేంద్రం తీరు ఏమాత్రం సరికాదంటూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న dsp జీవన్ రెడ్డి.... జోగురామన్నతో పాటు ప్రధాన నేతలను బలవంతంగా వాహనాల వరకు తీసుకెళ్ళారు.
ఈ క్రమంలో పోలీసులు, నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువురి మధ్య తోపులాట జరగడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
చివరికి మజిమంత్రిని పొలిసు వాహనంలో తరలించే ప్రయత్నం చేయగా... వాహనాన్ని నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
వారిని దాటుకుని పోలీసులు రూరల్ స్టేషన్ కు ఆయనను తరలించరు.మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ తో పాటు పలువురు నేతలు తిరిగి ఎంపీ ఇంటి ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు ..
ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న మాట్లాడుతూ... అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోళ్లకు కేంద్రం కొత్త నిబంధనలను తెస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
పత్తి కొనుగోళ్ళు ప్రారంభమైన తొలిరోజు ఆరువందల పత్తి వాహనాలు వస్తే అందులో అయిదింటికి మాత్రమే పన్నెండు శాతం తేమ వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న cci నిబంధనలు సదలించాల్సింది పోయి... స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు వాటిని సమర్ధించడం అన్యాయమని మండిపడ్డారు.
వారి రాజకీయాల కోసం రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న ఎంపీ ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఉండడం వారి అసమర్ధతకు నిదర్శనం అన్నారు.
ఇలాంటి సమయం లో రైతులకు మద్దతు ఇవ్వకుండా, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా వ్యవహరించడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకే ఎంపీ ఇంటి ముట్టడి చేశామని,
పోలీసులను మొహరించి తమను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సోయా కొనుగోళ్ళ కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కొనుగోళ్ళు మాత్రం జరగడం లేదన్నారు.
అన్నదాతలకు అండగా brs పార్టీ నిలబడుతుందని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం తప్పదని స్పష్టం చేశారు.కార్యక్రమంలో brs నేతలు విజ్జగిరి నారాయణ,
అలాల్ అజయ్, గంద్రత్ రమేష్, పవన్ నాయక్,బట్టు సతీష్, ధమ్మపాల్, ప్రకాష్, సెవ్వ జగదీష్,ప్రశాంత్, కుమ్ర రాజు,అడపా తిరుపతి,దేవిధస్,వసంత్, తదితరులు పాల్గొన్నారు..
Comments