భారీగా పెరుగుతున్న వెండి ధర.వారం లో ఏకంగా 24వేలు పెరుగుదాల.
By
Rathnakar Darshanala
భారీగా పెరుగుతున్న వెండి ధర.వారం లో ఏకంగా 24వేలు పెరుగదాల.
నేటి వార్త హైదరాబాద్, నవంబరు 30 –
దేశీయ మార్కెట్‌లో పసిడి–వెండి ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. నవంబరు చివరి వారంలో వెండి ధర రికార్డు స్థాయిలో పెరిగి ఇన్వెస్టర్లు, ఆభరణాల కొనుగోలుదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
అదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పసిడి డిమాండ్ పెరగడం ధరలను మరింత పైకెత్తింది.
నవంబరు 21న 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,23,146 ఉండగా, 28న అది రూ.1,26,591కి చేరుకుంది.
అంటే కొన్ని రోజుల్లోనే దాదాపు రూ.3,445 పెరిగినట్టైంది. నవంబరు 30 నాటికి తులం ధర రూ.1,29,820 వద్ద నిలవడంతో మొత్తం ఒక వారంలోనే రూ.6 వేలకుపైగా ఎగిసినట్టు స్పష్టమైంది.
దేశవ్యాప్తంగా ప్రకటించే రేట్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వీటిలో తయారీ చార్జీలు, జీఎస్టీ ఉండవు. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో 3 శాతం జీఎస్టీతో పాటు తయారీ చార్జీలు అదనంగా చెల్లించాల్సిందే.
పసిడి సరసన వెండి ధరల పెరుగుదల మరింత తీవ్రమైంది. నవంబరు 21న కిలో వెండి ధర రూ.1,61,000 ఉండగా, 28న రూ.1,76,000కి చేరింది.
నవంబరు 30 నాటికి అది నేరుగా రూ.1,85,000 దాటింది. అంటే కేవలం ఒక్క వారంలోనే రూ.24 వేల వరకు పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పటిష్టం కావడం, అలాగే దేశంలో ముహూర్తాల సీజన్ మొదలవడంతో బంగారం–వెండి కొనుగోలు పెరగడం ధరల పెరుగుదలకు ముఖ్య కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్థిక అనిశ్చితి పెరిగిన సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆశ్రయం కోసం పసిడి వైపు మొగ్గుచూపడంతో ధరలు మరింత బలంగా నిలుస్తున్నాయని నిపుణుల అభిప్రాయం.
Comments