నేడు చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన.
By
Rathnakar Darshanala
*నేడు చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన*
నేటి వార్త పెద్దపల్లి జిల్లా : నవంబర్ 07
తెలంగాణ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో జోరు సాగిస్తున్నారు. రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ రెండు పార్టీలతో ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుందో చెబుతున్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తామో వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ప్రభుత్వ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలించారు.
మంథని నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న సభకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పెద్దపల్లి జెడ్పి చైర్ పర్సన్ మంథని నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మధు కోరారు..
మరోవైపు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రేపు నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం రామగుండం సీపీ రెమా రాజేశ్వరి పరిశీలించారు.
సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించి విషయాలను స్థానిక అధికారులతో పాటు బీఆర్ఎస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. మైదానంలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు....
Comments